- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kalki 2898 AD: భారీ గుడ్ న్యూస్.. ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘కల్కి 2898ఏడీ’!?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. మైథాలజికల్, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకండా.. ఈ మూవీ విడుదలై నెల రోజులు దాటుతున్నప్పటికీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్‌లో కల్కి హంగామా ఇంకా కొనసాగుతుండగా.. ఓటీటీ రిలీజ్‌పై ప్రజెంట్ ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అయితే.. ఈ చిత్రం రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ ఒప్పందం చేశారు నిర్మాతలు. ఈ లెక్కన సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కావాలి. కానీ అనుకున్నదానికంటే ముందే ఓటీటీ రిలీజ్ చేయాలని చూస్తున్నారని టాక్. ఈ మేరకు ఆగస్టు 23 నుంచే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే.. ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఆగస్టు 23 నుంచి రెంటల్ బేసిస్‌లో అందుబాటులోకి తీసుకురాగా.. అగ్రిమెంట్ ప్రకారం 8 వారాల తర్వాత రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. వీటిపై అదికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ‘కల్కి 2898 ఏడీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకోగా.. హిందీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.