రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు‌’లో సంచలన మార్పులు

by GSrikanth |   ( Updated:2023-10-21 16:45:37.0  )
రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు‌’లో సంచలన మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌నే సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా.. విడుదలైన రెండ్రోజులకే చిత్రబృందం సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా రన్‌టైమ్‌లో మార్పులు చేసింది. సుమారు అరగంట సినిమా నిడివి తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు 2.37 గంటల రన్‌టైమ్‌తో ఇకపై ఇది ప్రేక్షకులను అలరించనుంది. సినీ ప్రియుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story