Brahmastra ఎఫెక్ట్: అభిమానులపై Hrithik Roshan సీరియస్ (వీడియో)

by Javid Pasha |   ( Updated:2023-10-12 06:07:24.0  )
Brahmastra ఎఫెక్ట్: అభిమానులపై Hrithik Roshan సీరియస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన ఫ్యాన్‌పై ఫైరయ్యాడు. ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాకు తన పిల్లలు హ్రెహాన్, హ్రిధాన్‌తో కలిసి హృతిక్ వచ్చాడు. సినిమా తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ హృతిక్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు అడగడం ప్రారంభించారు. ఇంతలో ఓ యువకుడు వచ్చి బలవంతంగా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో హృతిక్‌ కోపగించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే, ఈ వీడియోలో తన పిల్లలు సేఫ్‌గా కార్లోకి ఎక్కేలా చూసుకునేందుకు హృతిక్ కారు పక్కనే నిల్చుని కనిపిస్తున్నాడు. అప్పుడే ఓ అభిమాని వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. హృతిక్ అడ్డుకుంటున్నప్పటికీ అభిమాని బలవంతంగా హృతిక్ చేతిని నెట్టి మరీ సెల్ఫీ తీసుకునేందుకు చూశాడు.

దాంతో హృతిక్‌ కోపగించుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి అతడిని పక్కకు నెట్టేసింది. ఈ వీడియో సోషల్ మీడియోలో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు హృతిక్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. స్టార్ల ప్రైవసీని మనం అర్థం చేసుకోవాలని, ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించడం మనదే తప్పని ఒకరు రాసుకొచ్చారు.

Advertisement

Next Story