రాజమౌళి ఇంట్లో ఏం జరిగినా.. ఆ కుర్ర హీరోయిన్‌కు ఎలా తెలుస్తుంది? బయటపడ్డ అసలు నిజం!

by Anjali |   ( Updated:2023-12-14 09:52:18.0  )
రాజమౌళి ఇంట్లో ఏం జరిగినా.. ఆ కుర్ర హీరోయిన్‌కు ఎలా తెలుస్తుంది? బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి సుపరిచితమే. ఈయన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. జక్కన్న దర్శకత్వం వహించిన సినిమాకు ఫ్లాప్‌లంటూ ఉండవు. సక్సెస్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు రాజమౌళి. ఇక ప్రేక్షకులైతే థియేటర్లలో ఎగబడి మరీ ఈ దర్శకుడి మూవీస్ చూస్తారు. అయితే రాజమౌళి దంపతులు, వీరి కుమారుడు కార్తికేయ, అటు కీరవాణి, కీరవాణి భార్య శ్రీవల్లి, వీరి కుమారులు, ఇటు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇలా మొత్తం అందరూ సినిమా కోసం సమష్టిగా కలిసి పనిచేసి సక్సెస్ కొడుతూ ఉంటారు. ఇక రాజమౌళి ఫ్యామిలీ కూడా ఒకే చోట ఉంటుంది. పక్కపక్కనే ఉన్న వీరంతా ఒకే ఉమ్మడి కుటుంబంగా పనిచేస్తూ కలిసిమెలిసి ఉంటారు. సినిమా షూటింగ్ జరిగినప్పుడు అయినా, ఫ్రీ టైంలోనైనా ఇంట్లో ఎప్పుడూ ఒక పండగ వాతావరణం నెలకొంటుంది.

ఈ కుటుంబాలంతా ఒకే దగ్గర కలిసి భోజనం చేసేందుకు ఇష్టపడతారట. బయట హోటల్స్‌కు వెళ్ళినా కూడా అన్ని ఫ్యామిలీస్ కలిసే వెళతాయట. అయితే జక్కన్న ఉండే ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లో టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా అద్దెకు ఉండేదట. రాజమౌళి కుటుంబం తో మంచి పరిచయం ఉందని, తన పట్ల ప్రేమ, ఆప్యాయత చూపిస్తారని రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వారి ఇంటి బయట ముగ్గులు వేస్తున్నప్పుడు ‘నేను కూడా వెళ్లి సాయం చేసేదాన్ని. ఆ కుటుంబంలో ఐక్యత చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. నన్ను కూడా వాళ్ల ఫ్యామిలీ మెంబర్‌గా చూసేవారు. రాజమౌళి భార్య రమా, కీరవాణి భార్య శ్రీవల్లి ఎంతో గౌరవించడంతోపాటు ఆప్యాయతతో చూసుకునేవారని హీరోయిన్ రాశీ కన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story