NTR's Devara Collections : దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి!

by Anjali |   ( Updated:2024-09-14 14:20:17.0  )
NTRs Devara Collections : దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సినిమా పేరే వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం కోసం నెట్టింట అభిమానులు హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తోన్న టీమ్ దేవరపై ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచుతున్నారు. 99 శాతం జనాలు తారక్ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే నమ్మకంతోనే ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన దేవర పార్ట్-1 సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలై ట్రైలర్ జనాల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇలా చిత్ర బృందం విడుదల నేపథ్యంలో పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేస్తూ దేవరపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీకి బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని నెట్టింట గట్టి టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే చాలా చోట్ల థియేట్రికల్ సేల్ జరిగిపోయిందని మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు సేల్ అయిందట. ఇకపోతే తెలుగులో తారక్ మూవీకి ఊహించని బిజినెస్ జరిగిందని సమాచారం. ఆంధ్రలో 55 కోట్లకు, నైజాంలో 42 కోట్లకు, సీడెడ్ లో 20 కోట్లకు దేవర థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. కాగా దేవర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 120 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలట. తెలుగులో అయితే మొత్తం 240 కోట్లు లేదా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే దేవర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే అంటున్నారు జనాలు. మరీ దేవర ఫ్యాన్స్ అంచనాలకు చేరుకోనుందా? తెలియాలంటే సెప్టెంబరు 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more : ఆచార్య పాద ఘట్టం.. దేవర సముద్ర మట్టం అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్.. మరి సినిమా హిట్ కొడుతుందా?

Advertisement

Next Story

Most Viewed