Hero Karthi: పెద్ద సాహసమే చేసిన కార్తీ .. 3 రోజుల్లో సత్యం సుందరం మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |   ( Updated:2024-09-30 05:49:42.0  )
Hero Karthi: పెద్ద సాహసమే చేసిన కార్తీ .. 3 రోజుల్లో సత్యం సుందరం మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో కార్తీ , అరవింద్ స్వామి కాంబోలో తెరకెక్కిన మూవీ ' సత్యం సుందరం '. రిలీజ్ కు ముందే సినిమా టీజర్, ట్రైలర్ అందర్ని ఆకట్టుకున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాని డైరెక్ట్ చేసిన సి. ప్రేమ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న తమిళంలో ఈ మూవీ విడుదలైంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఉండటంతో ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఇంక సెప్టెంబర్ 28న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ బాగానే వసూలు చేస్తుంది.

తమిళంలో ఈ మూవీ మూడు రోజుల్లో రూ. 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రోజు రోజుకి టాక్ మారడంతో కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇక, తెలుగులో ఫస్ట్ డే రూ. 40 లక్షలు, సెకండ్ డే రూ. 40 లక్షలు , మూడో రోజు రూ. 80 లక్షలు వసూలు చేసింది. మొత్తం వర్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా రూ. 12 కోట్లకుపైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Read More : డియర్ కార్తీ మీ సినిమా అద్భుతం'.. కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ ట్వీట్

Advertisement

Next Story