విష్ణుప్రియ మాజీ లవర్‌తో హాట్ బ్యూటీ రీతూ చౌదరి రిలేషన్..? ఛీ ఛీ ఏంటీ ఈ దారుణం అంటున్న పబ్లిక్‌

by Kavitha |
విష్ణుప్రియ మాజీ లవర్‌తో హాట్ బ్యూటీ రీతూ చౌదరి రిలేషన్..? ఛీ ఛీ ఏంటీ ఈ దారుణం అంటున్న పబ్లిక్‌
X

దిశ, సినిమా: ‘గోరింటాకు’ సీరీయల్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లో నటించి అలరించింది. ఇక జబర్దస్త్ షోలోకి వచ్చి మరింత ఫేమస్ అయింది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పటి యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరీ ఇద్దరు ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసినదే. వీరిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లి.. కలిసి పలు వీడియోలు చేస్తు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే విష్ణు ప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో తాను రిలేషన్ లో ఉన్నాను అంటూ రీతు చౌదరి బాంబు పేల్చింది. అసలు విషయం ఏమిటంటే శ్రీముఖి యాంకర్‌గా ‘కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్’ అనే ఒక షో స్టార్ మా లో ప్రసారమవుతోంది.

అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య పోటీ పెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కాలేజీ టీం తో ఒక స్కిట్ చేశారు. అందులో భాగంగా రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాసి అందరి ముందు చదివింది. అందులో భాగంగానే నీకోసం చేసే కాఫీ తోనే నా రోజు మొదలవ్వాలని లవ్ లెటర్‌లో రాస్తే మీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా అని విష్ణు ప్రియ అంటుంది. అయితే మా వాడికి కాఫీ అలవాటు లేదని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆ అబ్బాయిని నీ కంటే ముందు నేనే ప్రేమించాను కాబట్టి అంటూ సరదాగా కామెంట్ చేసింది. దీంతో షో లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే నిజంగా రీతు చౌదరి ప్రియుడిని ఒకప్పుడు విష్ణు ప్రియ ప్రేమించిందా? లేక షోలో స్కిట్ కోసమే ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే గాని ఈ విషయం మీద క్లారిటీ వచ్చేలా లేదు. ఇక ఈ షో ప్రోమో చూసిన నెటిజన్లు ఛీ ఛీ ఇంతకు తెగించారు ఏంటి అసలు ఈ దారుణాలు చూడలేక పోతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed