Anasuya Bharadwaj: సంచలన నిర్ణయం తీసుకున్న అనసూయ.. ఇకపై!

by Anjali |   ( Updated:2024-07-26 15:27:12.0  )
Anasuya Bharadwaj: సంచలన నిర్ణయం తీసుకున్న అనసూయ.. ఇకపై!
X

దిశ, సినిమా: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఏకంగా అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేస్తుంది. రీసెంట్‌గా ఈ భామ నటిస్తోన్న ‘సింబా’ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అనసూయ.. విజయ్ దేవరకొండలాంటి మొగుడొస్తాడని అనగానే ఈమె యాక్సెప్ట్ చేసి ముసిముసి నవ్వులు నవ్వడం హైలెట్‌గా నిలిచింది.

అయితే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అనసూయకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో మీకు వచ్చిన సినిమా అవకాశాలను రిజెక్ట్ చేస్తున్నారట కదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీంతో అనసూయ.. ‘నేను ఒక రోల్‌లో మూవీ చేస్తే.. అది సక్సెస్ అయితే అదే తరహాలో నటించే చాన్స్‌‌లు వస్తున్నాయి. కాగా కొన్ని చిత్రాలు రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు.. రామ్ చరణ్ సినిమాలో రంగమత్త పాత్రలో నటించా. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే క్షణం మూవీ కూడా. ఈ కారణంగా మూవీస్ రిజెక్ట్ చేస్తున్నాను. నేను గ్లామర్ ప్రదర్శించాలనుకుంటున్నాను. అందులో ఏలాంటి తప్పు లేదు. గ్లామర్ మెయింటైన్ చేసినన్నీ డేస్.. నాకు తగ్గ పాత్రలు వస్తే నటిస్తాను.’ అంటూ హాట్ యాంకర్ అనసూయ చెప్పుకొచ్చింది. చివర్లో పారితోషికం విషయంలో తప్పకుండా డిమాండ్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

Read more...

Krithi Shetty: రెడ్ మిర్చీలా తన అందాలతో ఘాటెక్కిస్తున్న కృతి శెట్టి.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story