లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాళవిక..

by Anjali |   ( Updated:2023-04-14 10:00:46.0  )
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాళవిక..
X

దిశ, సినిమా: మలయాళీ యాక్ట్రెస్ మాళవికా శ్రీనాథ్ కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలిపింది. ప్రముఖ నటి మంజూ వారియర్‌ కూతురి పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని కాల్ రావడంతో తాను వెళ్లానని చెప్పింది. ఈ క్రమంలో ఒక గ్లాస్ రూమ్‌లో డైలాగ్ చెప్తుండగా.. డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లి హెయిర్ సెట్ చేసుకోమని సూచించారని తెలిపింది. తాను అదే పనిలో ఉండగా వెనక నుంచి వచ్చిన వ్యక్తి తనను గట్టిగా పట్టుకున్నాడని, పది నిమిషాలు విడిచిపెట్టకుండా అలాగే ఉన్నాడని చెప్పింది. ఆ టైమ్‌లో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉండిపోయానని.. అప్పుడు కూడా తనను షూట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి చేతుల్లో కెమెరాను లాక్కొని నేలకు కొట్టానని తెలిపింది. దీంతో అతను కెమెరా తీసుకునే పనిలో ఉండగా.. బయట వెయిట్ చేస్తున్న అమ్మ, అక్క దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లానని వివరించింది. ఇలాంటి పరిస్థితులు మరో రెండు మూడు సార్లు ఎదుర్కొన్నానని చెప్పింది.

Also Read...

‘KGF’ నటికి అస్వస్థత..

Advertisement

Next Story