వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న 'హిట్ 2'

by Hajipasha |   ( Updated:2022-12-01 15:12:50.0  )
వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న హిట్ 2
X

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం 'హిట్ 2'. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరి నటించింది. అయితే ఈ సినిమాకి ఆల్రేడి ఫుల్ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేవలం ప్రీమియర్స్‌తో ఆల్రెడీ లక్ష డాలర్స్ దాటేసిది. ఈ చిత్రం డెఫినెట్‌గా 2 లక్షల డాలర్ల మార్క్‌ను అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్‌లో టాక్ నడుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని నైజాంలో 210, సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 245 వరకు అంటే మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 550 నుంచి 600 థియేటర్లలో విడుదల అవుతుంది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 85, ఓవర్సీస్‌లో 320 థియేటర్లలో రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 955 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ MORE

చిరు-బాలయ్య కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా!

Advertisement

Next Story

Most Viewed