ఆయన మరణం చాలా బాధాకరం.. లావణ్య త్రిపాఠి ఎమోషనల్ ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2024-04-01 08:27:04.0  )
ఆయన మరణం చాలా బాధాకరం.. లావణ్య త్రిపాఠి ఎమోషనల్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (45) ఈరోజు మరణించారు. శుక్రవారం అర్థరాత్రి చెస్ట్‌లో పెయిన్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. డేనియల్ మరణవార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురైంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠీ ఆయన మరణ వార్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఈ వార్త విని నేను చాలా షాక్ అయ్యాను. చాలా బాధపడ్డాను. అతను చాలా అసాధారణమైన నటుడు, చాలా త్వరగా వెళ్లిపోయాడు’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

కాగా.. నటుడు డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో యాభైకి పైగా సినిమాల్లో నటించాడు. ‘చిట్టి’ అనే తమిళ సీరియల్‌తో బుల్లి తెర ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తెలుగు ప్రేక్షకులకు ‘పిన్ని’ సీరియల్‌తో దగ్గరయ్యారు. అంతే కాకుండా, తెలుగులో ఎన్టీఆర్ సాంబ, వెంకటేష్ ఘర్షణ, రామ్ చరణ్ చిరుత, నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో.. వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకున్నారు నటుడు డేనీయల్ బాలాజీ.

Read More..

సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’.. వామ్మో రన్ టైం అంతనా..?

Advertisement

Next Story