హీరో రామ్‌తో అనుపమ పెళ్లి.. స్పందించిన హీరోయిన్ తల్లి!

by Hamsa |   ( Updated:2023-10-05 11:39:54.0  )
హీరో రామ్‌తో అనుపమ పెళ్లి.. స్పందించిన హీరోయిన్ తల్లి!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ అనుపమ ప్రేమించుకుంటున్నారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా, రామ్‌తో అనుపమ పెళ్లిపై ఆమె తల్లి సునీత స్పందించినట్లు సమాచారం. ‘‘ పెళ్లి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అనుపమ, రామ్‌కు ఎలాంటి సంబంధం లేదు. వీరిద్దరు కలిసి ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే సినిమాల్లో మాత్రమే కలిసి నటించినంత మాత్రానా పెళ్లి అని పుకార్లు పుట్టిస్తున్నారు అంటూ సునీత చెప్పుకొచ్చింది.

అలాగే ఒకప్పుడు బుమ్రా, అనుపమ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ మేము పట్టించుకోలేదు. అనుపమ పెళ్లి విషయంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిన అనుపమ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More: అలా చేయడానికి అభ్యంతరం ఏం లేదు.. తాప్సీ ఆసక్తికర కామెంట్స్

Advertisement

Next Story