Hina Khan: క్యాన్సర్‌తో పోరాడటానికి సిద్దమవుతున్న హీరోయిన్.. ఏకంగా గుండు చేసుకుంటూ వీడియో(పోస్ట్)

by Kavitha |
Hina Khan: క్యాన్సర్‌తో పోరాడటానికి సిద్దమవుతున్న హీరోయిన్.. ఏకంగా గుండు చేసుకుంటూ వీడియో(పోస్ట్)
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు క్యాన్సర్ అనే మహమ్మారి బారిన పడుతున్నారు. కొంత మంది దీని నుంచి కోలుకోని బయట పడి మరో లైఫ్‌ను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా నటి హీనా ఖాన్ కూడా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు థర్డ్‌ స్టేజ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే తనకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి తన ఫ్యాన్స్‌తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అలాగే ఆమె భయపడకుండా ధైర్యంగా ఈ భయంకరమైన వ్యాధితో పోరాడుతోంది. ఇందుకు తొలి అడుగుగా తల గుండు చేసుకుంది ఈ అందాల భామ. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో.. క్యాన్సర్ చికిత్స సమయంలో నెమ్మదిగా నా జుట్టు రాలిపోతూ ఉంది. దీంతో నాకు చాలా చిరాకుగా, స్ట్రెస్ ఫుల్‌గా అనిపిస్తుంది. ఈ సమయంలో నేను గుండు చేసుకోవడం ఒకటే మార్గం. ఇది కొంచెం బాధతో కూడిన పనే కానీ తప్పదు. అవసరమైనప్పుడు విగ్గు పెట్టుకుంటానని.. శారీరక అనారోగ్యాన్ని ఎదుర్కోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె తెలియజేస్తూ తల మొత్తం గుండు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీలు, ఆమె అభిమానులు 'మీరు త్వరగా కోలుకోవాలని' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to hina khan instagram id)

Advertisement

Next Story