- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ డైరెక్టర్‌కు చనువు ఇస్తే ఏం చేస్తాడో తెలుసు.. అంత అవకాశం ఇవ్వను.. మొహమాటం లేకుండా చెప్పేసిన యాంకర్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ వింధ్య విశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ యాంకర్ సుమ స్ఫూర్తిగా యాంకరింగ్ ఫీల్డ్‌లోకి వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో పాటు ఐపీఎల్‌లోనే తెలుగు కామెంటరీ ఇస్తుంటోంది. ఇలా క్రికెట్ యాంకరింగ్ చేస్తూ.. తెలుగు యాంకర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతే కాకుండా.. టాలీవుడ్‌లో కూడా వింధ్య యాంకర్‌గా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వింధ్య.. అవకాశాల గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘ఒకసారి ఓ నిర్మాణ సంస్థ దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాను. వాళ్లు అంతగా స్పందించలేదు. దీంతో నేను ఇక ఆఫర్స్ అడగడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆఫర్ల కోసం చనువుగా బిహేవ్ చేయడం.. ఒకరి దగ్గరకి వెళ్లి నాకు ఆఫర్ ఇవ్వండి అని అడగడం నేను ఎప్పుడు చెయ్యలేదు’ అని చెప్పుకొచ్చింది. ఇక కొంత మంది ఈవెంట్స్‌లో యాంకర్లని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ సెటైర్లు వేస్తుంటారు కదా. దానిపై మీ ఒపీనియన్ ఏంటీ అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి వింధ్య స్పందిస్తూ.. ‘నా వరకు నేను జాగ్రత్తగా ఉంటాను. ఎవరితో ఎక్కడ వరకు ఉండాలో అలాగే ఉంటాను. మన లిమిట్స్‌లో మనం ఉంటే ఎవ్వరూ టచ్ చెయ్యరు. ఉదాహరణకు.. రాంగోపాల్ వర్మ లాంటి వారు ఈవెంట్‌కు వస్తే.. నేను జాగ్రత్తగా మాట్లాడతాను. ఆయనతో ఎక్కువ చనువు ఉండను. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడతారో తెలుసు. ఆయనకి చనువిస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. జస్ట్ సింపుల్‌గా.. రామ్ గోపాల్ వర్మ వేదికపైకి వచ్చి మాట్లాడాలి అని అంటాను. అంతకి మించి ఒక్క మాట కూడా ఎక్స్‌ట్రా మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చింది. మాట్లాడను. మన లిమిట్స్ లో మనం ఉంటే ఎవ్వరూ టచ్ చేయరు అని వింధ్య తెలిపింది.
- Tags
- Vindhya Vishaka