భర్త అంగీకారంతో ఆ బిజినెస్ స్టార్ చేసి హీరోయిన్ స్నేహ.. షాక్‌లో ఫ్యాన్స్..!

by Anjali |   ( Updated:2024-02-08 15:36:17.0  )
భర్త అంగీకారంతో ఆ బిజినెస్ స్టార్ చేసి హీరోయిన్ స్నేహ.. షాక్‌లో ఫ్యాన్స్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ స్నేహ గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తెలుగు బడా హీరోల సరసన నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ స్నేహ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కు షేర్ చేసుకుంటుంది.

తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ‘నా కెరీర్, లైఫ్ లో గొప్ప సపోర్ట్ నిలిచిన నా ప్రియమైన అభిమానులకు, ఇన్నేళ్లు మీరు నాపై చూపించిన ప్రేమకు నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎవరి లైఫ్ లోనైనా వారి డ్రీమ్స్ నెరవేరడం గొప్ప విషయం. నేను ఇప్పుడు అలాంటి అద్భుతమైన ఆనందంలో ఉన్నాను. నేను నా సొంత సిల్క్ చీర స్టోర్ ‘స్నేహలయా సిల్క్స్’ ను స్టార్ట్ చేశాను. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలను కోరుతున్నాను.’ అంటూ హీరోయిన్ స్నేహ వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ అందరూ.. మీరు రియల్లీ గ్రేట్ మేడమ్.. సినిమాల్లో అవకాశాలు తగ్గాయని ఏ మాత్రం కుంగిపోకుండా మరో బిజినెస్ స్టార్ట్ చేశారు అంటూ స్నేహ యాటిట్యూడ్ కు షాక్ అవుతూ.. కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఈ స్టోర్ ఈ నెల (ఫిబ్రవరి)12 వ తేదీన ఓపెన్ కానుంది. .

Advertisement

Next Story

Most Viewed