- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలైవా 170 సినిమా షూటింగ్‌లో హీరోయిన్ రితికా సింగ్‌కు గాయాలు.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ రితికా సింగ్ వెంకటేష్ గురు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల కింగ్ ఆఫ్ కొతాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ప్రస్తుతం రితికా సింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ రితికా సింగ్ గాయపడింది. చేతులపై అక్కడక్కడా గాయాలు అయి రక్తం వస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ రితికా తన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. ‘‘అప్పటికే అందరూ జాగ్రత్త అని మెచ్చరిస్తున్నా నేను గాయాలపాలైయ్యాను.
అక్కడ ఉన్న ఓ గాజు అద్దం వల్లే ఇదంతా జరిగింది. బట్, ఇట్స్ ఓకే.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు క్షణాల్లో జరిగిపోయేవాటిని మనం ఆపలేము. నేను పట్టు కోల్పోవడం వల్లే ఇలా జరిగింది. ఈ గాయం వల్ల షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. దీన్నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే సెట్స్‌లో పాల్గొంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రితికా సింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండమని కామెంట్లు చేస్తున్నారు.