పెళ్లికి అవి చాలా ముఖ్యం.. వాటికి నేను రెడీగా లేను..! హీరోయిన్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-06-01 06:51:16.0  )
పెళ్లికి అవి చాలా ముఖ్యం.. వాటికి నేను రెడీగా లేను..! హీరోయిన్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ‘నచ్చావులే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే విజయం అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత నాని స్నేహితుడా, అరవింద్-2 వంటి మూవీలతో అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్‌లు చేస్తోంది. తాజాగా, పెళ్లి ప్రశ్నలపై గట్టి కౌంటర్ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ముఖ్యం ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవడం అనేది ఆమె నిర్ణయం. ప్రస్తుతం నేను శారీరకంగా, మానసికంగానూ పెళ్లికి రెడీగా లేను. నా భవిష్యత్తపై కూడా నమ్మకంగా లేను. ఇది నా నిర్ణయం.. నా జీవితం’’ అంటూ ఓ ఫొటో షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More... యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘గుంటూర్ కారం’ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

ఎన్టీఆర్ సాంగ్ కాపీ చేసి.. మహేష్ ‘గుంటూర్ కారం’కి బీజీఎం.. థమన్‌పై నెటిజన్ల ఫైర్

అడవి శేషుకి ఆ స్టార్ యాంకర్‌తో ఎఫైర్ నిజమేనా?

Advertisement

Next Story