పవన్ కల్యాణ్ తొలిప్రేమ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందంటే..?

by Hamsa |
పవన్ కల్యాణ్ తొలిప్రేమ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందంటే..?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి నటించిన మూవీ ‘తొలిప్రేమ’. ఇది పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇందులో నటించిన హీరోయిన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ముఖ్యంగా ఇందులో ఎంట్రీ సీన్ ఇప్పటికీ ఎంతోమంది ఫెవరేట్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు అందం, అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత కీర్తి రెడ్డికి తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించింది. కానీ తెలుగులో నటించకుండా బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ కూడా అంతగా సక్సెస్ కాకపోవడంతో మొత్తానికి ఇండస్ట్రీకి దూరం అయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు.

తాజాగా, కీర్తి రెడ్డికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అవి చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇలా మారిపోయిందేంటని అంటున్నారు. అలాగే కొందరు మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇమేనా పవన్ కల్యాణ్ సినిమాలో నటించిందని అనుమానపడుతున్నారు. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కీర్తి రెడ్డి అక్కినేని సుమంత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత ఓ ఎన్‌ఆర్‌ఐని పెళ్లి చేసుకున్న ఆమె అమెరికాలోనే సెటిల్ అయింది. సినిమాలకు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed