- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాకు ఇంతవరకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు.. ‘వకీల్‌సాబ్’ హీరోయిన్ ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం మూవీతో అనన్య అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు చిన్న చిన్న సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ చిత్రంలో నటించింది. అప్పటినుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తంత్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ భయపెట్టిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తంత్ర మూవీ మార్చ్ 15న అడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొటోంది అనన్య. ఇటీవల ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నది. తనకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదని.. ఇండస్ట్రీ వాళ్లను చూస్తే కమిట్ అయి ఉంటారని అనుకుంటారని.. కానీ ఇప్పటికీ తను మాత్రం కమిటేడ్ కాదని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.