హీరో సుశాంత్ సింగ్ డెత్ కేసు : దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-29 07:37:45.0  )
హీరో సుశాంత్ సింగ్ డెత్ కేసు : దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ డెత్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ మాట్లాడుతూ ఈ కేసులో ప్రాథమిక సమాచారం అంతా వాళ్లు వీళ్లు చెప్పిన మాటల ఆధారంగానే ఉంది. కానీ ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత మంది తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారని వాటిపై తాము చర్యలు తీసుకున్నామన్నారు.

వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు సేకరించారని ప్రస్తుతం వాటి విశ్వసనీయతను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ కేసుపై తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనన్నారు. కాగా 2020 జూన్‌లో సుశాంత్ ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో కుట్ర కోణం ఉందనే ఆరోపణలు రావడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. మూడేళ్లు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫడ్నవీస్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Read More: Kangana Ranaut :మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కంగన..ఆ స్టోరీకి తను మాత్రమే న్యాయం చేయగలదట

Advertisement

Next Story