- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాస్పదంగా మారిన హీరో సిద్దార్థ్ ట్వీట్.. ఎట్టకేలకు దిగొచ్చి క్లారిటీ ఇచ్చేసిన లవర్ బాయ్!
దిశ, సినిమా: ఢీల్లీలో ఆదివారం మార్చి 17న ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మహిళలు కప్ ఎత్తుకుని ఎంతో సంబరపడిపోయారు. దీంతో మహిళల్లో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడింది. అయితే బెంగళూరు వీధుల్లో సంబరాలు మిన్నంటాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వాటిని చూసిన టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టి వివాదంలో చిక్కుకున్నాడు.
ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ ఒక టోర్నమెంట్‌లో మహిళల జట్టు విజయం సాధించింది. కానీ రోడ్డుపై మాత్రం సంబరాలు చేసుకునేందుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదు. దీనికి కారణం పితృస్వామ్య వ్యవస్థకు ఇది సరైన ఉదాహరణ’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? మహిళలు గెలిస్తే.. పురుషులు సెలబ్రేట్ చేసుకోవడం తప్పా? అలా చేయడం నేరమా అని ఏకి పారేస్తున్నారు.
ఇక ఈ దెబ్బకు సిద్దార్థ్ దికొచ్చి ముందు చేసిన ట్వీట్‌కు వివరణ ఇచ్చాడు. ‘‘ పైన ట్వీట్ గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశంలో పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరని నా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ ట్వీట్ చేశాను. మహిళలు కూడా పురుషుల్లాగా తమ విజయాన్ని అర్థరాత్రి సమయంలో సంబరాలు చేసుకోలేకపోతున్నారే అని చెప్పాలనుకున్నాను’’ అంటూ మరో ట్వీట్ చేశాడు. అయినప్పటికీ నెటిజన్లు ఊరుకోకుండా ఆయన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ వివాదం నుంచి సిద్దార్థ్ ఎలా బయటపడతాడో చూడాలి.
- Tags
- Siddharth