- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sandeep Kishan: అలాంటి సమస్యతో బాధపడుతున్న హీరో సందీప్ కిషన్.. ఊపిరాడక పోవడంతో!
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఊరు పేరు భైరవ కోన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 16న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం సందీప్ కిషన్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ‘రాయన్’ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికి ధనుష్ దర్శకత్వం వహించడంతో పాటుగా హీరోగా నటిస్తున్నాడు. అయితే రాయన్ మూవీ జూలై 26న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా.. సందీప్ కిషన్ తనకున్న అనారోగ్య సమస్య గురించి బయట పెట్టాడు. ‘‘ ఒక రోజు రాయన్ మూవీ షూటింగ్ మొత్తం పొగ, డస్ట్‌తో ఉన్న సీన్స్ చేయాల్సి వచ్చింది. అయితే నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలు ఉండటంతో ఊపిరాకలేదు. నేను ఇబ్బంది పడుతుండగా.. నన్ను చూసిన రాయన్ మూవీ మేకర్స్ అంబులెన్స్ తెప్పిస్తామని అన్నారు. కానీ నేను వారికి అక్కర్లేదని చెప్పి కాసేపు బయటకు వెళ్లి రెస్ట్ తీసుకుని స్వచ్ఛమైన గాలి పీల్చుకుని నార్మల్ అయిపోయి సీన్స్ చేశాను. కానీ కాళిదాసు మాత్రం పడిపోయాడు. కాసేపటి తర్వాత లేచాడు’’ అని చెప్పుకొచ్చాడు.
- Tags
- Sandeep Kishan