తమకు పుట్టపోయే బిడ్డ గురించి కీలక ప్రకటన చేసిన రామ్ చరణ్, ఉపాసన

by Javid Pasha |   ( Updated:2023-03-02 05:42:15.0  )
తమకు పుట్టపోయే బిడ్డ గురించి కీలక ప్రకటన చేసిన రామ్ చరణ్, ఉపాసన
X

దిశ, వెబ్ డెస్క్: RRR మూవీతో హీరో రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ మూవీ.. ఆస్కార్ లో సైతం సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇకపోతే 2022 డిసెంబర్ లో తాము మొదటిసారి పేరేంట్స్ కాబోతున్నట్లు రామ్ చరణ్, ఉపాసన ప్రకటించారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే ఇటీవలే రామ్ చరణ్ అమెరికా వెళ్లొచ్చారు. అక్కడ గుడ్ మార్నింగ్ అనే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అమెరికాలోనే ఫేమస్ డాక్టరైన జెన్నిఫర్ ఆష్టాన్ అపాయింట్ మెంట్ కోరారు. దీంతో ఉపాసన డెలివరీ కోసం అమెరికా వెళ్తుందని అంతా అనుకున్నారు.

కానీ తాజాగా ఈ స్టార్ కపుల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమకు పుట్టబోయే బిడ్డ గురించి కీలక ప్రకటన చేశారు. తమ మొదటి బిడ్డ ఇండియాలోనే పుడుతుందని తెలిపారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లోనే తన బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఉపాసన తెలిపారు. డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో పాటు అమెరికా డాక్టర్ జెన్నిఫర్ కూడా తన బిడ్డకు పురుడు పోసే కార్యక్రమంలో పాల్గొంటారని ఉపాసన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed