సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లతోనే సినిమాలు.. ఈ హీరో ప్లాన్ మామూలుగా లేదుగా?

by sudharani |   ( Updated:2024-10-07 15:23:15.0  )
సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లతోనే సినిమాలు.. ఈ హీరో ప్లాన్ మామూలుగా లేదుగా?
X

దిశ, సినిమా: హీరో నితిన్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్నాడు. 2020లో వచ్చిన ‘భీష్మ’ చిత్రం తర్వాత నాలుగైదు సినిమాలు తీసినప్పటికీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. ప్రజెంట్ ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రాబిట్ హుడ్’ ఒకటి. నితిన్‌కు హిట్ ఇచ్చిన ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు.. నితిన్ చేతిలో ‘తమ్ముడు’ కూడా ఉంది. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే.. ఇప్పుడు ఈ హీరో మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఇష్క్’ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో చేతులు కలిపాడు. ఇక హనుమాన్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రైమ్ షో సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ కూడా ఉన్నట్లు టాక్. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ కావడంతో.. గతంలో హిట్ ఇచ్చిన డైరెక్టర్లతోనే ఇప్పుడు సినిమాలు చేస్తుండటంతో.. నితిన్ ప్లాన్ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed