హీరో నవీన్ చంద్ర భార్య ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిందా?

by Anjali |   ( Updated:2023-10-03 15:31:49.0  )
హీరో నవీన్ చంద్ర భార్య ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ‘నవీన్ చంద్ర’. ప్రస్తుతం ఈ హీరో కలర్స్ స్వాతితో కలిసి ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తానని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా అక్టోబరు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదంతా పక్కన పెడితే.. పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని నవీన్ చంద్ర భార్య ‘ఓర్మా’ గురించి నెట్టింట ఓ వార్త స్ప్రెడ్ అవుతోంది. కేరళకు చెందిన ఓర్మాను నవీన్ పెళ్లి చేసుకుని.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ హీరో గతేడాది ప్రేమికుల రోజున సోషల్ మీడియా వేదికగా ఈ హీరో తన భార్యను ఇంట్రడ్యూస్ చేశాడు. ‘‘తాను కేరీర్‌ పరంగా సక్సెస్ సాధించడం వెనక నా భార్య ఉంది. తను చాలా సపోర్ట్‌గా ఉంటుంది. అంటూ నవీన్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా నవీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై.. ‘‘ఓర్మా ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిక్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. నా సినిమాల కథల ఎంపికలో కూడా ఆమె తన వంతుగా సహకారం అందిస్తుంటుంది. ఓర్మా ప్యూచర్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటూ’’ నవీన్ వెల్లడించారు.

Advertisement

Next Story