మీడియా మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురయ్యా.. కార్తీ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2024-10-22 12:23:34.0  )
మీడియా మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురయ్యా.. కార్తీ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ (తెలుగులో సత్యం సుందరం). ‘96’ (తెలుగులో జాను) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘ఇది సక్సెస్ మీట్‌లా లేదు. ఫ్యామిలీ ఫంక్షన్‌లా అనిపిస్తుంది. ముందు ‘సత్యం సుందరం’ కథ వినగానే ఇలాంటి సినిమాను చూస్తారా అనే అనుమానం వచ్చింది. కానీ, కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది. మీడియా ఈ మూవీ గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురయ్యాను. అలాగే ఎంతో మంది ఫోన్ చేసి ఎమోషనల్ అవుతుంటే చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్‌గా కూడా ఇలాంటి సినిమాలు మంచి హిట్ అవ్వాలి. అలాగే ఇలాంటి చిత్రాల వల్ల మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed