మరోసారి గొప్ప మనసు చాటుకున్న HERO దళపతి విజయ్

by GSrikanth |
మరోసారి గొప్ప మనసు చాటుకున్న HERO దళపతి విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనకు తెలుగులోనూ మాంచి ఫాలోయింగ్ ఉంది. మాస్టర్, బిగిల్, బీస్ట్, లియో వంటి చిత్రాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధించాయి. ఇక ఈ మధ్యనే విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో సొంతంగా పార్టీని స్థాపించారు. ఇక ఇప్పటికే విజయ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం తమిళనాడు వరద బాధితులకు భారీగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. గతేడాది 12వ తరగతి పరీక్షలో 600/600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్‌ నెక్లెస్‌‌ను కానుకగా ఇచ్చాడు. అదే సమయంలో రెండు వేల మంది ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సాయం చేశాడు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 10, 12వ తరగతి ఫలితాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్ధులను తమిళనాడు వెట్రి కజగం తరపున విజయ్‌ ఓ ప్రకటనలో అభినందిస్తూ, త్వరలోనే కలుస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story