School Life: సినిమా పిచ్చితో ఇల్లు అమ్మి మరీ మూవీ తీస్తున్నా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
School Life: సినిమా పిచ్చితో ఇల్లు అమ్మి మరీ మూవీ తీస్తున్నా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పులివెందుల మహేష్ హీరో అండ్ డైరెక్టర్‌గా చేస్తున్న సినిమా ‘స్కూల్ లైఫ్’. నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్ & క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నేడు ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరగ్గా.. ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి సముద్ర హాజరై టీమ్‌ని సపోర్ట్ చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ ‘ఈరోజు కృష్ణానగర్ నుంచి వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీడియా, ప్రేక్షకులు. సినిమా మీద ఉన్న ఇష్టంతో కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో అలాగే నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ చేస్తారని నమ్ముతాను. అలాగే మా మూవీని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 100% సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story