- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో అక్షయ్ కుమార్ గిన్నిస్ రికార్డు.. ఇంతకు ఆయన ఏం చేశాడంటే..?
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ త్వరలో రిలీజ్ కానున్న తన 'సెల్ఫీ' మూవీ ప్రమోషన్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఓ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. తన మూవీ 'సెల్ఫీ' ప్రమోషన్ లో భాగంగా అక్షయ్ తన ఫ్యాన్స్ తో సరదాగా గడిపాడు. వందల సంఖ్యలో ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగాడు. ఈ క్రమంలోనే అక్షయ్ ఫ్యాన్స్ తో కేవలం 3 నిమిషాల్లోనే 184 సెల్ఫీలు దిగాడు. దీంతో మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీలు దిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించి 'సెల్ఫీ కింగ్' గా మారాడు. తన ఫ్యాన్స్ ఒక్కొక్కరుగా రాగా వారందరిని అక్షయ్ తన ఫోన్ సెల్ఫీల ద్వారా బంధించాడు.
అనంతరం ఆ ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి '' నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానంతటికి నా ఫ్యాన్స్ నాపై చూపించిన ప్రేమాభిమానాలే కారణం. నా జీవితంలో తోడుగా నిలబడిన నా ఫ్యాన్సందరికీ ఇదే స్పెషల్ థ్యాంక్స్. నా ఫ్యాన్స్ సహకారంతో 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగి అత్యధిక సెల్ఫీల కేటాగిరిలో గిన్నిస్ రికార్డు సృష్టించాం'' అని అక్షయ్ కుమార్ రాసుకొచ్చారు. ఈ రకంగా 2015లో లండన్‌లోని శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్ షోలో 3 నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసిన డ్వేన్ జాన్సన్ రికార్డును అక్షయ్ కుమార్ బద్దలు కొట్టాడు.