Tollywood: చిన్నప్పుడు స్వీటూ.. ఇప్పుడేమో హాటూ.. ఈమె ఎవరంటే?

by Prasanna |   ( Updated:2024-08-23 14:40:36.0  )
Tollywood: చిన్నప్పుడు స్వీటూ.. ఇప్పుడేమో హాటూ.. ఈమె ఎవరంటే?
X

దిశ, సినిమా : ఈ మధ్య సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళ కుట్టి చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. రీసెంట్ గా పాన్ ఇండియా మూవీతో పెద్ద హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇక్కడ చూద్దాం..

ఈ బ్యూటీ ఎవరో కాదు ఐశ్వర్య లక్ష్మీ. 1991 సెప్టెంబర్ 6న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. మెడిసిన్ చదివి.. నటనపై మక్కువతో.. సినీ రంగంలోకి అడుగుపెట్టింది. సినిమాల్లోకి రాకముందే.. స్టార్టింగ్ లో పలు యాడ్స్ చేసి పాపులారిటీ తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మీకి.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ టు ఆఫర్స్ తో దూసుకెళ్లింది. 2017లో మలయాళ మూవీ 'మాయానది' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టింది.

2019లో 'యాక్షన్‌' సినిమాతో ఐశ్వర్య లక్ష్మీ తమిళ మూవీతో అడుగుపెట్టింది. ఇక ఇటీవల హీరో విష్ణు విశాల్‌తో చేసిన 'గట్ట కుస్తీ' సినిమాతో తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే, మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియిన్ సెల్వన్ టూ పార్ట్స్‌లోనూ ఈ హీరోయిన్ నటించింది. ఈ మూవీలో పూంగుళీ పాత్రతో అందర్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమెకి సంబందించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్చల్ అవుతున్నాయి

Advertisement

Next Story