Keerthy Suresh: బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు.. వారి వల్ల మనఃశాంతి కరువైంది.. ఆమె తండ్రి షాకింగ్ కామెంట్స్

by Nagaya |   ( Updated:2023-05-27 10:43:15.0  )
Keerthy Suresh:  బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు.. వారి వల్ల మనఃశాంతి కరువైంది.. ఆమె తండ్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, అందంతో, క్యూట్ లుక్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. కీర్తి సురేష్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. ఇద్దరు సేమ్ కలర్ దుస్తులు ధరించి తిరుగున్నారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా వాళ్లిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ట్రోల్స్ వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన కీర్తి ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కేరళ బీజేపీ నాయకురాలు శోభా సురేంద్రన్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ ప్రకటన విడుదల చేశారు.

‘‘నా కుమార్తె కీర్తి సురేష్ ఒక అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, ఆమె అతనితో పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అవన్నీ ఫేక్ న్యూస్. నాకు అబ్బాయి తెలుసు. అతడు సన్నిహిత కుటుంబ స్నేహితుడు. ఫర్హాన్ పుట్టినరోజున, కీర్తి కొన్ని ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేసింది. వాటిని ఒక తమిళ ఆన్‌లైన్ మ్యాగజైన్ సేకరించింది. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే మీడియాకు, ప్రజలకు ముందుగా తెలియజేస్తాము. అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ చేయడం కారణంగా కుటుంబంలో మనఃశాంతి కరువవుతుందని’’ ఆయన తెలిపారు.

Read More... ప్రతిరోజు 16 గంటలు.. వారానికి ఒకరోజు మొత్తం.. అదే నా సీక్రెట్

SSMB 28 : టైటిల్ ఇదేనా..?

Advertisement

Next Story