బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హేమ.. సంచలన పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-08-20 15:13:19.0  )
బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో  బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హేమ.. సంచలన పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వెళ్లినట్లు వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమ పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు హైడ్రామా చేసింది. ఇక దర్యాప్తు చేసిన పోలీసులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారించారు. అంతేకాకుండా టెస్ట్ చేసి నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణ కోసం అరెస్ట్ చేసి కొద్ది రోజుల జైలులో ఉంచారు.

ఆ తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది ఆమెపై ట్రోల్స్ చేయడంతో పాటుగా, దారుణమైన కామెంట్లు కూడా చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా జైలు నుంచి బయటకు వచ్చిన కానుంచి హేమ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తాను తప్పు చేయలేదని పలు విషయాలు చెబుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, హేమ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ‘‘ అందరికీ నమస్కారం నేను మీ హేమను. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి. మీ అందరికీ తెలుసు. 30 సంవత్సరాలుగా సంపాదించుకున్న నా పరువును భూస్తాపితం చేశారు.

అయితే నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. నా జుట్టుతో పాటుగా గోర్లు బ్లడ్ అన్నీ చేయించుకుంటే నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు చానల్స్‌లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఒక్కటే. నేను ఎలాంటి టెస్టుకైనా బహిరంగంగా రెడీగా ఉన్నాను అని మీ ముందు చెప్పడానికి వచ్చా. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అపాంట్‌మెంట్ కావాలని అడగడానికే ఈ వీడియో పెడుతున్నా’’ అని చెప్పుకొచ్చింది.

Read More..

HEMA: అవును నేను రేవు పార్టీకి వెళ్ళాను.. నేనేమి సాంప్రదాయని కాదంటూ నటి హేమ సంచలన కామెంట్స్


Click Here FOr Twitter Post..

Advertisement

Next Story