అక్కడికి వెళ్లని వాడు మగాడే కాదు: ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
అక్కడికి వెళ్లని వాడు మగాడే కాదు: ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం కాంట్రావర్సీలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో గల బేబీ డాల్స్ క్లబ్‌లో ఎంజాయ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. కాగా ‘ప్రస్తుతం నేను డల్లాస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి నేను వెళ్లాలనుకుంటున్న బేబీ డాల్స్ క్లబ్‌కి వెళ్లాను. ప్రపంచంలోని ప్రతి మగాడు బాయ్ డాల్స్ జెంటిల్ మెన్స్ క్లబ్‌ను సందర్సించాలి. వెళ్లని మగాళ్లు, మగాళ్లే కాదు’’ అంటూ ట్వీట్ చేశాడు. కారణం ఎంటో తెలియదు కానీ వర్మ ప్రస్తుతం ఈ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఇటీవల ఆర్జీవీ డెన్ అనే ఆఫీస్ ఓపెన్ చేసి.. అందులో తనకు ఇష్టమైన యాక్టర్స్ అమితాబ్, శ్రీదేవి ఫోటోలను, తన సినిమాల వర్కింగ్ స్టిల్స్‌తో ఆఫీస్ మొత్తం నింపేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story