తాతగారి ఫంక్షన్‌లకు రావాలా? వొద్దా? అనేది ఆయన ఇష్టం.. జై ఎన్టీఆర్: Sri Reddy

by Nagaya |   ( Updated:2023-08-29 12:11:41.0  )
తాతగారి ఫంక్షన్‌లకు రావాలా? వొద్దా? అనేది ఆయన ఇష్టం.. జై ఎన్టీఆర్: Sri Reddy
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ శ్రీరెడ్డి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు. కానీ తారక్ హాజరు కాలేదు. దీంతో అందరూ ఆయన ఎందుకు రాలేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నోటికొచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే దీనిపై తాజాగా శ్రీ రెడ్డి ఓ ట్వీట్ చేసింది. ‘తాత గారి ఫంక్షన్‌లకు వచ్చినంత మాత్రాన ఆయన మీద ప్రేమ ఉన్నట్లు కాదు. రానంత మాత్రాన ప్రేమ లేనట్లు కాదు. జూనియర్ ఎన్టీఆర్‌కి తాతగారి మీద ఎంత ప్రేమ ఉందో, తెలుగు రాష్ట్రాల్లో పసి పిల్లోడిని అడిగినా చెప్తాడు. పెద్దాయన ఎన్టీఆర్ గారి మీద ప్రేమ అనే ముసుగులో రాజకీయాలు చేసే వారికి దూరంగా ఉండాలనుకోవటంలో తప్పు లేదు కదా. అయినా రావడం, రాకపోవడం ఆయన ఇష్టం. జై ఎన్టీఆర్’ అంటూ హీరోను పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More..

ఒకే వేదికపై ఎన్టీఆర్ కుటుంబం.... దూరంగా జూ.ఎన్టీఆర్

బన్నీలో నాకు బాగా నచ్చిన విషయం అదే : శ్రీరెడ్డి ట్వీట్ వైరల్

ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఇస్తే చరణ్ గుక్కపెట్టి ఏడుస్తాడనే.. ఇలా జరిగింది?

Advertisement

Next Story