- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్ చేద్దామంటూ కాళ్ల మీద పడ్డాడు: స్టార్ హీరోపై కంగనా సంచలన ఆరోపణలు!
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచే బాలీవుడ్ హీరోయిన్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోయిన్ బాలీవుడ్ మీద ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ భామ హీరోయిన్‌గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారంటూ ఈ బ్యూటీ మీద నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. ఇక కంగనా రాఘవ లారెన్స్ సరసన చంద్రముఖి-2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామ తాజాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆ హీరోను మాఫియా సూపర్ స్టార్ అంటూ దుమారం రేపింది. తాజాగా ఆయనను ఉద్దేశించి ఓ సంచలన పోస్టు పెట్టింది. బాలీవుడ్ మాఫియా సూపర్ స్టార్ పెద్ద ఉమెనైజర్.
ఆ హీరో చాలామందితో డేటింగ్ చేశాడు. నాతో కూడా డేటింగ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నాతో డేటింగ్ చేయడం కోసం నా వెంట పడ్డాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వచ్చాడు. చాలాసార్లు ఇంటికి వచ్చి కూడా బతిమాలాడు. నా కాళ్ల మీద కూడా పడ్డాడు. కపట ప్రేమను చూపించాడు. ఓపెన్ గానే ఎన్నోసార్లు అడిగాడు. కానీ నేను అస్సలు అంగీకరించలేదు. రిజెక్ట్ చేసినా సరే అస్సలు వినిపించుకోకుండా నన్ను టార్చర్ చేశాడు. దీంతో నాపై కక్ష సాధించి.. నా సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి ఇబ్బంది పెట్టాలని చూశాడు. నాకు ఒకసారి రణ్ బీర్ సినిమాలో అవకాశం వచ్చినా సరే కావాలనే రిజెక్ట్ చేశానంటూ’’ కంగనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి.