నేను ఎప్పటికీ నీదాన్నే.. హాజెల్ కీచ్ హార్ట్‌ఫెల్ట్ నోట్ వైరల్

by samatah |   ( Updated:2022-12-01 15:47:39.0  )
నేను ఎప్పటికీ నీదాన్నే.. హాజెల్ కీచ్ హార్ట్‌ఫెల్ట్ నోట్ వైరల్
X

దిశ, సినిమా : బ్రిటీష్ యాక్ట్రెస్, మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ భార్య హాజెల్ కీచ్.. తమ 6వ పెళ్లి రోజు సందర్భంగా హార్ట్‌ఫెల్ట్ నోట్ షేర్ చేసింది. ఈ మేరకు తన ఆరేళ్ల వైవాహిక జీవితం ఎంతో ఆనందకరంగా సాగుతుందని, తనను యువీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడని చెప్పింది. ఈ ఆరేళ్లలో ఎన్ని మనస్పర్థలు వచ్చినా తన భర్త పక్కన గర్వంగా నిలబడి ఉన్నందుకు అదృష్టంవంతురాలినన్న ఆమె.. 'జీవితం ఒక సాహసం లాంటిది. ఈ రైడ్‌ని ఆస్వాదిద్దాం. ఇటీవలే తల్లిదండ్రులైన మనం మరింత బాధ్యతగా ఉండాలని భావిస్తున్నా. టన్నుల కొద్ది నవ్వులు, బాధలు మనని ఒక చోట చేర్చాయి. నేను ఎప్పటికీ మీదాన్నే. ఐ లవ్ యూ..మై డియర్ హజ్బెండ్' అంటూ మురిసిపోయింది. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన యువీ.. 'హ్యాపీ 6 బేబీ! మన ప్రేమను నిలబెట్టిన ఎన్నో క్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఆస్క్‌డ్ ఫర్ ఏ బెటర్ పార్ట్‌‌నర్ ఇన్ క్రైమ్. హ్యాపీ యానివర్సరీ' అంటూ లవ్ లీ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంగా ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక 2016లో వీరిద్దరూ పెళ్లిచేసుకోగా 2022 జనవరిలో ఒక బిడ్డకు జన్మినిచ్చారు.

READ MORE

డిసెంబర్ 22న వస్తున్న ఇంటర్వెల్ లేని సినిమా.. 'కనెక్ట్'

Advertisement

Next Story