Sreeleela: అవకాశాల కోసమే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచిందా?

by Prasanna |   ( Updated:2024-09-11 14:44:51.0  )
Sreeleela: అవకాశాల కోసమే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచిందా?
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి సందడి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ పక్కన చేసే ఛాన్స్ ని కొట్టేసి ధమాకా మూవీతో పెద్ద హిట్ అందుకుంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో తెలుగులో ఒకేసారి ఆరు సినిమాలకు పైగా సినిమాల్లో అవకాశం కొట్టేసింది. కానీ , ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. ఆమె తీసిన సినిమాలు వరుసగా ప్లాప్స్ రావడంతో సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది. పవర్ స్టార్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ తప్ప కొత్త సినిమా ఏది కమిట్ అవ్వలేదని తెలుస్తుంది.

ఏమనుకుందో ఏంటో.. పూర్తిగా సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నెట్టింట లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఆమె అభిమానులను, ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా, పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి.. సినిమాలు కోసమే గ్లామర్ డోస్ పెంచావా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed