అసలు నువ్వు ఏం అనుకుని రీమేక్ సినిమాలు తీస్తున్నావ్ అంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్

by Hamsa |
అసలు నువ్వు ఏం అనుకుని రీమేక్ సినిమాలు తీస్తున్నావ్ అంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ సినిమాలు తెరకెక్కిస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మూవీస్ హిట్ సాధించడంతో ఆయనకు భారీ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న.. ఈ మూవీ ఆగస్టు 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే మేకర్స్ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో.. హరీష్ శంకర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు.

తాజాగా, ఓ నెటిజన్ ‘‘ అసలు ఏం అనుకుంటున్నావ్ అన్నా.. రీమేక్ సినిమాలు ఎందుకు వద్దు అంటున్నామో చెప్పడానికి మాకు బోలేడు కారణాలున్నాయి. రీమేక్ మూవీలే ఎందుకు చేయాలనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు. రీమేక్ అయితే కేవలం మన ఫ్యాన్స్ చూస్తారు అన్నా. కానీ న్యూట్రల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి. ప్లీజ్ చేంజ్ చేయండి’’ అని రాసుకొచ్చాడు. ఇక అది చూసిన హరీష్ శంకర్ చూసే నీకే అంత కన్సర్న్ ఉంటే.. తీసే నాకెంత ఉండాలి’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ప్రజెంట్ వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్న మిస్టర్ బచ్చన్ కూడా రీమేక్ అని తెలుస్తోంది. అయినప్పటికీ హరీష్ శంకర్ బాగా తీయడం వల్లనే అలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు.

Advertisement

Next Story