హరికృష్ణ జయంతి.. Jr. NTR ఎమోషనల్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-02 13:24:02.0  )
హరికృష్ణ జయంతి.. Jr. NTR ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హరికృష్ణ 67వ జయంతిని స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.’ అని నందమూరి హరికృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో కింద నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామరావు అని వుంది. కాగా నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని పెళ్లికి హైదరాబాద్ నుంచి వెళ్తుండగా నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story