Hardhik- Natasa: మాజీ భార్య పోస్ట్‌పై స్పందించిన హార్దిక్ పాండ్యా.. మీరు మళ్లీ కలవండి అంటూ..

by Kavitha |   ( Updated:2024-07-25 04:10:58.0  )
Hardhik- Natasa: మాజీ భార్య పోస్ట్‌పై స్పందించిన హార్దిక్ పాండ్యా.. మీరు మళ్లీ కలవండి అంటూ..
X

దిశ, సినిమా: మోడల్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటాషా స్టాంకోవిచ్‌ను హార్ధిక్ పాండ్యా 2020లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని చాలా రోజుల నుంచి వచ్చిన పుకార్ల సమయంలోనే నటాషా తన కొడుకు అగస్త్యను తీసుకొని తన సొంత దేశం అయినా సెర్బియాకు వెళ్ళిపోయింది. ఈ తర్వాత రోజే హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అయితే నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తాజాగా తన భార్య పోస్ట్‌ను లైక్ చేసి, కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజాగా నటాషా తన కొడుకుతో కలిసి మ్యూజియం చూసేందుకు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొడుకు, భార్య ఫొటోలు చూసిన హార్దిక్ పాండ్యా వాటిని లైక్ చేశాడు. అంతేకాదు.. హార్ట్ ఎమోజీతో పాటు మరో మూడు విభిన్న ఎమోజీలతో హార్ధిక్ కామెంట్ రాశాడు. దీనిని చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ మీరు మళ్లీ కలవండి అంటూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

(video link credits to natasa stankovic instagram id)

Advertisement

Next Story