- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే నెలతప్పిన నటి.. తప్పని ట్రోలింగ్
దిశ, సినిమా: టెలివిజన్ నటులు డెబినా బోనర్జీ - గుర్మిత్ చౌదరి రెండోబిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే మొదటి బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే డెబినా మళ్లీ నెలతప్పడంపై ఆశ్చర్యపోయిన నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ శుభ సందర్భంలో కూడా తమను టార్గెట్ చేసి హింసించడం భాధకరమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటులు. అయితే ఈ గుడ్ న్యూస్ ఇంట్లో చెప్పినప్పుడు కుంటుంబ సభ్యులు 'శభాష్' అని ప్రశంసించినట్లు తెలిపారు. తామెప్పుడూ ఇలా కోరుకోలేదని, కానీ దేవుడి నిర్ణయంగా భావించి సంతోషంగా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే మొదటి బిడ్డకోసం ఐదేళ్లు కష్టపడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్న డెబినా.. వైద్యులను సంప్రదించకుండానే గర్భం దాల్చడం, ఆలస్యం చేయకుండా మొదటిబిడ్డకు తోడునివ్వడం అతిపెద్ద బహుమతి అని పేర్కొంది. చివరగా ఇది వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నానన్న ఆమె.. తన అన్నయ్యకు తనకు మధ్య కేవలం 11 నెలల తేడా ఉన్నట్లు వెల్లడించింది.