Guppedantha Manasu: పోలీస్ స్టేష‌న్‌ కి వెళ్లి మనుని నిలదీసిన వ‌సుధార‌...

by Prasanna |
Guppedantha Manasu: పోలీస్ స్టేష‌న్‌ కి వెళ్లి మనుని నిలదీసిన వ‌సుధార‌...
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

మ‌నం ఎంత బాగా నమ్మితే అంతలా నమ్మక ద్రోహం చేస్తూనే ఉంటారు అంటూ శైలేంద్ర‌వైపు చూస్తూ మాట్లాడుతాడు మ‌హేంద్ర‌. శైలేంద్ర.. నా వైపు చూసి అంటున్నాడేంటని కంగారు ప‌డ‌తాడు. మన సార్ కి ఆగలేక .. నా వైపు చూపించి చేతులు చూపించారేంటని మ‌హేంద్ర‌ను అడుగుతాడు. నిన్ను కాదు నేను అన్నది మ‌నును అంటూ మ‌హేంద్ర మాట‌మార్చేస్తాడు.

మ‌నం యాభై కోట్లు అప్పు తిరిగి ఇవ్వ‌లేమ‌నే..కదా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇంక కాలేజీని సొంతం చేసుకోవ‌డానికి మ‌ను ఇంకా ఎన్ని కుట్ర‌లు చేస్తాడో, ఇదంతా కాదులే కానీ, బోర్డు మీటింగ్ పెట్టి అతను చేసిన చెడు పనుల గురించి బ‌య‌ట‌పెడ‌దామ‌ని మ‌హేంద్ర ఆవేశంగా అంటాడు. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని.. మ‌ను పంపించిన నోటీసుల‌ను ముఖంపై కొట్టి, ఎందుకు ఇలా చేసావ్ అని అతన్నే అడుగుతా అని కోపంగా, వ‌సుధార పోలీస్ స్టేష‌న్‌కు వెళుతుంది. వారిద్ద‌రి డ్రామాను నిజ‌మ‌ని శైలేంద్ర న‌మ్ముతాడు.

పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న మ‌ను ద‌గ్గ‌ర‌కు వ‌సుధార వెళ్తుంది. ఇప్పటి వరకు నీ మీద చాలా గౌర‌వం ఉండేది. దీనితో మొత్తం పోగొట్టుకున్నారంటూ మ‌నుపై ఫైర్ అవుతుంది వ‌సుధార‌. మీ కాలేజీ నాకు యాభై కోట్లు అప్పు ఉంది. ఆ అప్పు ఇవ్వ‌క‌పోతే కాలేజీ నా ఆధీనంలోకి వచ్చేస్తుంది అంటూ వ‌సుధార‌కు చెబుతాడు మ‌ను.

Advertisement

Next Story

Most Viewed