Guppedantha Manasu : నా ఇగోను టచ్ చేయొద్దు అంటూ.. వసుధారకు వార్నింగ్ ఇచ్చిన శైలేంద్ర

by Prasanna |   ( Updated:2023-10-28 06:44:13.0  )
Guppedantha Manasu : నా ఇగోను టచ్ చేయొద్దు అంటూ.. వసుధారకు వార్నింగ్ ఇచ్చిన  శైలేంద్ర
X

దిశ,వెబ్ డెస్క్: నా ఇగోను టచ్ చేయొద్దు వసుధార అని శైలేంద్ర గట్టి గట్టిగా అరుస్తాడు. మీరు ఇంకా మారకపోతే మిమల్ని ఎవరు బాగు చేయలేరు అని వసుధార అనడంతో.. కోపంతో ఫోనును విసిరికొడతాడు. ఇంతలో కాఫీ పట్టుకుని ధరణి వస్తుంది. మీరే అసలైనా ఆర్టిస్టులు, నేను మీ ముందు బచ్చాగాన్ని అని శైలేంద్ర అంటాడు. కాఫీ చల్లారిపోతుందని చేతిలో కాఫీ పెట్టి వెళ్లిపోతుంది ధరణి.

ఇంకో పక్క తనపై చేసిన కార్ అటాక్ గురించి ఆలోచిస్తుంటాడు రిషి. నా గతం నన్ను ఇప్పటికి వెంటాడుతుంది. వాడు ఎవడో గానీ, ముసుగు వేసుకుని ఈ పనులు చేస్తున్నాడు. ఒక చిన్న ఆధారం దొరికిన వాడిని ఎలా అయినా పట్టుకుంటాను అని రిషి అనుకుంటాడు. కాలేజీ స్టార్ట్ అవుతుంది. రిషి వాళ్లను పిలవమని ఫణీంద్రకు శైలేంద్ర చెబుతాడు. లేదు. వాళ్లు సరదాకి వెళ్లలేదు. నా తమ్ముడి బాగు కోసం వెళ్లారు. నేను కాల్ చేసి చెప్పను అని ఫణీంద్ర అంటాడు.

Advertisement

Next Story