- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hanuman Movie: ‘గుంటూరు కారం’ తగ్గింది.. ‘హనుమాన్’ స్పీడ్ పెరిగింది.. ఇది ఎవరు ఊహించని రిజల్ట్
దిశ,సినిమా: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చుసినా హనుమాన్ సినిమా గురించే చర్చ నడుస్తుంది. ఈ మూవీ తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళం, కన్నడం, హిందీలో కూడా నేడు విడుదలైంది. అన్ని చోట్ల ఈ మూవీ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పోటీగా ఉన్న స్టార్ హీరో సినిమాలను సైతం తొక్కుకుంటూ ముందుకు వెళుతోంది. రానున్న రోజుల్లో రికార్డులను బద్దలు కొట్టడమే ఖాయమని, కొత్త రికార్డులను సృష్టిస్తుందని అంటున్నారు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.
హనుమాన్ చిత్రాన్ని తొక్కేస్తున్నారంటూ నెటిజన్లు కొద్దిరోజులుగా సినీ పరిశ్రమలోని పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోలపై మండిపడుతున్నారు. దానికి కారణం.. ఈ చిత్రానికి పోటీగా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సినిమాలు కూడా విడుదల కావడమే. 25 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో పాతుకుపోయిన దర్శకులు, నిర్మాతలు చిన్న సినిమాలను తొక్కాలని చూస్తే వాళ్లే పెద్ద సినిమాలను తొక్కేస్తారని హనుమాన్ నిరూపిస్తోంది. గుంటూరు కారం మూవీ చూసిన వాళ్లు.. అయ్యా.. త్రివిక్రమ్ నువ్వు అన్ని సార్లు బ్రేకులు వేసినప్పుడే మేము అర్ధం చేసుకోవాల్సింది.. సినిమాలో దమ్ము లేదని, అయినా చిన్న హోప్ ఉండేది.. ఈ రోజు మొత్తం పోయిందంటూ డైరెక్టర్ మీద మండిపడుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, ఎంత పెద్ద సినిమాలనైనా ఓడించవచ్చని హనుమాన్ మరోసారి నిరూపించింది.. ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్నవారికీ కూడా ఈ సినిమా మంచి గుణపాఠం నేర్పించింది.
Also Read..
దేవుని రూపంలో దర్శనమిచ్చిన మహేష్ బాబు.. కలకలం సృష్టిస్తున్న ఫ్లెక్సీ
Mahesh Babu సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం‘ షో క్యాన్సిల్?.. కారణం అదే.. వైరల్ అవుతున్న ఫోటో