గుంటూరు కారం రివ్యూ.. ఈ సంక్రాంతి పందెం కోడి.. (ట్వీట్ వైరల్)

by sudharani |   ( Updated:2024-01-17 07:47:59.0  )
గుంటూరు కారం రివ్యూ.. ఈ సంక్రాంతి పందెం కోడి.. (ట్వీట్ వైరల్)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో అభిమానుల్లో స్పెషల్ జోష్ నెలకొంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది.. అల వైకుంఠపురములో’ సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలను ట్యాగ్ చేస్తూ.. వీటికంటే ‘గుంటూరు కారం’ పెద్ద హిట్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మహేశ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతికి పెందెం కోడి దిగేసిందంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Advertisement

Next Story