లక్షల్లో స్కామ్‌లు చేస్తున్న Shahruk khan భార్య.. ధనవంతులే టార్గెట్‌గా

by samatah |   ( Updated:2023-06-28 06:54:09.0  )
లక్షల్లో స్కామ్‌లు చేస్తున్న Shahruk khan భార్య.. ధనవంతులే టార్గెట్‌గా
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పెద్ద అవినితిపరురాలని, ధనవంతులను మోసం చేస్తూ లక్షల్లో సంపాదిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. ఈ మేరకు ఇంటీరియర్ డిజైనర్‌గా పేరుపొందిన గౌరీ పనిని ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆయన.. ‘గౌరిఖాన్ ఇంటీరియర్ డిజైన్ & ఫర్నీచర్ పరిశ్రమలో అతిపెద్ద మోసాలకు పాల్పడుతోంది. ఆమె చేసే ప్రతి పనిలోనూ స్కామ్‌లున్నాయి. ఆమె నకిలీ డిజైన్‌లు & ఫర్నీచర్‌ని సరఫరా చేస్తూ ధనవంతులను కొల్లగొడుతోంది. అబద్దాలతోనే లక్షలు సంపాదించింది. ఇంటీరియర్ డిజైన్‌లో తనకు ABC కూడా తెలియదు. ఎవిల్ ఉమెన్’ అంటూ నోట్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా చాలామంది ఇది నిజమేనంటూ ఉమైర్ ఆరోపణలను సమర్థిస్తున్నారు.

Advertisement

Next Story