గోపిచంద్ ‘రామబాణం’ పబ్లిక్ టాక్ హిట్టా ఫట్టా?

by Hamsa |   ( Updated:2023-05-05 09:19:03.0  )
గోపిచంద్ ‘రామబాణం’ పబ్లిక్ టాక్ హిట్టా ఫట్టా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో గోపీచంద్, శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రామబాణం’. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదలైంది. ‘రామబాణం’ సినిమా చూసిన వారు ట్విట్టర్ వేదికగా గమ అభిప్రయాలను తెలుపుతున్నారు. రామబాణం సినిమాలో జగపతిబాబు , గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం చాలా బాగా చూపించారని.. ఇందులో జగపతిబాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెబుతూ ఉంటారు. ఈ సినిమా అంతా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే.. హీరోయిన్ డింపుల్ ఇందులో యూట్యూబర్గ్‌గా తన అందం , నటనతో అందరినీ ఆకట్టుకుంది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్ డింపుల్ తో రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపినా అవేమీ వర్క్ అవుట్ కాలేదంటున్నారు. కామెడీ అక్కడక్కడా పర్లేదు అనిపించిందట. మరి కొంత మంది సినిమా మళ్లీ గోపీచంద్ మార్క్ సీన్స్ కనిపించాయి అంటున్నారు. అంతే కాదు ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగుంది చెబుతున్నారు. కాగా రామబాణం మిక్స్‌‌డ్ టాక్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్, సప్తగిరి తదితరులు నటించారు. గోపీచంద్ కి ఈ మూవీ ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: అల్లరి నరేష్ ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ


Advertisement

Next Story