'Simhadri' రీ రిలీజ్‏కు సర్వం సిద్ధం !

by Prasanna |   ( Updated:2023-01-17 10:17:21.0  )
Simhadri రీ రిలీజ్‏కు సర్వం సిద్ధం !
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో రీ రిలీజ్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే భారీ ఎత్తున కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కాగా తాజాగా మరో సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు మేకర్స్. తారక్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్లాక్ బస్టర్ 'సింహాద్రి' సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఇది నిజంగా తారక్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త అని చెప్పాలి. ఇక ఈ సినిమాను 4కే వెర్షన్‌లోకి అప్‌డేట్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, ఎన్‌టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ మూవీ రీ రిలీజ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న లేదా అంతకుముందే శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 'బ్రహ్మముడి: ఒకరికి ఒకరై'.. తెలుగు సీరియల్‌ను ప్రమోట్ చేస్తున్న Sharukh Khan!

Advertisement

Next Story