'LIGER' ప్రీరిలీజ్ ఈవెంట్.. అక్కడ ప్లాన్ చేసిన టీమ్

by Hamsa |   ( Updated:2022-08-18 09:00:58.0  )
LIGER ప్రీరిలీజ్ ఈవెంట్.. అక్కడ ప్లాన్ చేసిన టీమ్
X

దిశ,సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా లెవల్‌లో ఆగ‌స్టు 25న రిలీజ్ కానున్న సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుకాగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 20 సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా మోతడక ప్రాంతంలోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్‌‏లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పటికే మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న చిత్రం.. U/A సర్టిఫికెట్ పొందగా.. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను అల‌రించడానికి సిద్ధమవుతోంది.

Advertisement

Next Story