Prabhas అభిమానులకు శుభవార్త.. త్వరలోనే ‘Salaar' Trailer..

by sudharani |   ( Updated:2023-09-20 15:10:38.0  )
Prabhas అభిమానులకు శుభవార్త.. త్వరలోనే ‘Salaar Trailer..
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సలార్’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయో దర్శకుడు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వారు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్, డిసెంబర్‌ లేదా జనవరి ఈ మూడు నెలల్లోనే ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ప్రకటన రావాల్సివుంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ అక్టోబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ప్రభాస్ బర్త్ డే కాబట్టి అక్టోబర్ 23న ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story